పెళ్లి చేసుకున్నఇరుముడి హీరోయిన్..వరుడు ఎవరో తెలుసా?

తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన హోమ్లీ ఇమేజ్ సొంతం చేసుకున్న నటి ఇటీవల మాస్ మహారాజా రవితేజ సరసన ఇరుముడి అనే బ్లాక్‌బస్టర్ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అందాల భామ ప్రియా భవానీ శంకర్ తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ రాజ్‌వేల్ రాజ్ ను పెళ్లి చేసుకుంది. చెన్నైలో అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక చాలా సింపుల్‌గా జరిగినట్లు సమాచారం. తన పెళ్లి గురించి ముందుగా ఎలాంటి గ్రాండ్ అనౌన్స్మెంట్స్ ఇవ్వలేదు, మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కేవలం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో కొన్ని ప్రత్యేకమైన ఫొటోలను పంచుకుంటూ పెళ్లి వాతావరణాన్ని ఫ్యాన్స్‌కు హింట్‌గా ఇచ్చారు. చేతులకు గోరింటాకు పెట్టుకుని సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ, ప్రియుడు రాజ్వేల్తో కలిసి ఆమె తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. హీరోయిన్లు కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు సాధారణంగా బిజినెస్మెన్స్నో, ప్రొడ్యూసర్లనో, డైరెక్టర్లనో పెళ్లి చేసుకోవడం మనం చూస్తుంటాం. కానీ ప్రియా ఈ విషయంలో చాలా డిఫరెంట్. ఆమె పెళ్లి చేసుకున్న రాజ్‌వేల్ రాజ్.. ఎవరో సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు. ఆమె కాలేజీ రోజుల నుంచి ఆమెను అమితంగా ప్రేమించిన వ్యక్తి. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి దాదాపు 14 ఏళ్లు దాటింది. ఒక సినిమా స్టోరీని తలపించేలా వీళ్ల లవ్ స్టోరీ సాగింది.
కాలేజీలో మొదలైన వీరి పరిచయం.. ప్రియా కెరీర్ ఎదుగుతున్న ప్రతీ దశలోనూ ఒక బలమైన పునాదిలా నిలబడింది. హీరోయిన్ల జీవితాల్లో స్టార్డమ్ వచ్చాక బ్రేకప్స్ జరగడం చాలా కామన్. కానీ, దశాబ్దానికి పైగా సాగుతున్న ఈ బంధంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా, కెరీర్ పరంగా ప్రియా ఎంతో బిజీగా మారినా సరే.. ఇద్దరూ ఒకరికొకరు తోడుగా నిలబడ్డారు. రాజ్‌వేల్ ఒక సపోర్టివ్ పార్టనర్‌గా ప్రియా వెన్నంటి ఉన్నాడు. 2020లోనే ప్రియా భవానీ శంకర్ తన ప్రేమను, తన బాయ్ ఫ్రెండ్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి అధికారికంగా పరిచయం చేసింది. అప్పటినుంచి ఈ బ్యూటీ పెళ్లి పీటలు ఎప్పుడెక్కుతుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు, ఇప్పుడు ఫైనల్లీ గుడ్ న్యూస్ చెప్పేసింది. ప్రియా భవానీ శంకర్ సినీ ప్రయాణం కూడా చాలా ఆసక్తికరం. ఆమె మొదట్లో ఎవరూ ఊహించని విధంగా ఒక న్యూస్ ఛానెల్లో వార్తలు చదివే న్యూస్ రీడర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. తన అందం, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి విజయ్ టీవీలో రాజా రాణి అనే సీరియల్లో అవకాశం వచ్చింది. ఆ సీరియల్ తమిళనాట ఒక సెన్సేషన్. ఆ సీరియల్ సక్సెస్‌తో నేరుగా వెండితెరపైకి అడుగుపెట్టారు. మేయాద మాన్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ప్రియా.. ఆ చిత్రం ఇచ్చిన సక్సెస్‌తో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. కార్తీ సరసన కడైకుట్టి సింగం , అరుణ్ విజయ్‌తో మాఫియా, మాన్స్టర్, ఓ మనపెన్నే, యానై, కమల్ హాసన్ ప్రతిష్టాత్మక చిత్రం ఇండియన్ 2 లాంటి భారీ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక ఇటీవలే టాలీవుడ్లో రవితేజ సరసన ఇరుముడి సినిమాలో తనదైన నటనతో తెలుగు ఆడియన్స్‌ను కట్టిపడేశారు. ఎంత పెద్ద స్టార్డమ్ వచ్చినా, గ్లామర్ షోల వెంట పడకుండా తనకంటూ ఒక లిమిట్ పెట్టుకుని నటిస్తూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఇక తాజాగా కొత్త జీవితాన్ని ప్రారంభించడంతో ఈ క్యూట్ కపుల్‌కు ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ తారలతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.



